రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ, ఆద్యా రెడ్డి హీరో హీరోయిన్లుగా నీలిమ పతకంశెట్టి మరో హీరోయిన్ గా నటించిన జగమెరిగిన సత్యం మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. దాదాపుగా 30 ఏళ్ల క్రితం గ్రామీణ నేపథ్యం, అప్పటి మనుషుల కట్టుబాట్లు, డైరెక్టర్ చిన్నతనంలోని అనుభవాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగాలు, సంస్కృతి, మ్యూజిక్ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
 
అమృత సత్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్ పై ఎమోషనల్ రూరల్ డ్రామా జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. విరాటపర్వం సినిమాకు పని చేసిన సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించడం కొసమెరుపు. తెలంగాణ గ్రామీణ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం గమనార్హం.


కథ :
 
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సత్యం(అవినాష్ వర్మ) అనే యువకుని లైఫ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పైకి సాధారణ వ్యక్తిలా కనిపించే సత్యం లైఫ్ లో ప్రేమ, బాధ, త్యాగంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. నిజ జీవితంలో మనం చూసే పాత్రల్లా ఈ సినిమాలోని పాత్రలు ఉంటాయి. ఈ సినిమాలోని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయాన్ని మెలిపెట్టేలా ఉన్నాయి.


విశ్లేషణ :  
 
చిన్న చిన్న సన్నివేశాల్లోనూ హృదయాన్ని తాకే భావోద్వేగ సన్నివేశాలు తెలంగాణ సంస్కృతి, భాష, ఆచారాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సత్యం జీవితంలో వచ్చిన తిరుగుబాటు, తాను నిలిచిన విలువలు, చివరికి ఊరిని ఒక కొత్త దిశలో తీసుకెళ్లే అతని కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బలమైన ఎమోషన్స్ తో ఈ సినిమా ముగుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంది.
 
సత్యం పాత్రలో నటుడి భావోద్వేగ ప్రదర్శన, చిన్న చినమ్మ పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. కొన్ని చోట్ల ఎమోషనల్ గా సాగే కథనం ఈ సినిమాకు మైనస్ అయింది. జగమెరిగిన సత్యం" ఒక సినిమా కాదు – అది మన ఊరును, మన భూమిని, మన మనిషిని తాకే అనుభూతి. ఇది ప్రేక్షకులు అనుభవించాల్సిన సినిమా అని చెప్పవచ్చు. ఎమోషన్, సంస్కృతి, ప్రేమ, త్యాగం అన్నీ కలిసిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని చెప్పవచ్చు.
 
రేటింగ్ : 2.75/5.0
 


మరింత సమాచారం తెలుసుకోండి: