
ప్రముఖ ఓటీటీలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. ఈ రెండు ఓటీటీలలో ఏ ఓటీటీ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ రెండు ఓటీటీలలో ఏ ఓటీటీ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నా ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంది. అఖండ2 సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.
స్టార్ హీరో నందమూరి బాలయ్య మార్కెట్ ను మించి మేకర్స్ ఈ సినిమా కోసం ఖర్చు చేస్తుండగా ఈ సినిమా ఆ రేంజ్ కలెక్షన్లను సాధిస్తుందో లేదో చూడాలి. సెప్టెంబర్ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఆ డేట్ కు ఈ సినిమా విడుదలవుతుందో లేదో చూడాలి. హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ 35 నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. అఖండ2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.