
'కుబేర' నుంచి వచ్చిన తొలి పాట.. 'పోయిరా మామ'. ఈ పాట ఫుల్ ఎనర్జీతో, మాస్ బీట్‌తో యూత్‌ని ఉర్రూతలూగిస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ స్వయంగా ఈ పాటను పాడటమే కాదు.. తన అద్భుతమైన ఎనర్జిటిక్ స్టెప్పులతో వీడియోలో అదరగొట్టాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) తన మార్క్ సంగీతం అందించగా, పాపులర్ లిరిసిస్ట్ భాస్కరభట్ల అదిరిపోయే సాహిత్యం రాశారు.
శేఖర్ కమ్ముల, ధనుష్, DSP లాంటి ముగ్గురు టాప్ టాలెంట్స్ మొదటిసారిగా కలిసి పని చేసిన సినిమా ఇది కావడంతో 'కుబేర'పై భారీ అంచనాలున్నాయి. ఈ పాట వింటుంటేనే మాస్ జాతరలా అనిపిస్తోంది. ఇప్పటికే ఇది చార్ట్‌బస్టర్ అయ్యేలా ఉంది. 'పోయిరా మామ' పాట విన్న ఎవరైనా సరే.. కాళ్లు కదపకుండా, పాట పాడుకుండా ఉండలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు.
పాటతో పాటు, 'కుబేర' సినిమా కూడా తన స్టార్ కాస్ట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ధనుష్ తో పాటు, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆసియన్ సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న మల్టీపుల్ లాంగ్వేజెస్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అందరూ క్లాస్ డైరెక్టర్‌గానే చూసిన శేఖర్ కమ్ముల, ఇలా డాన్స్ తో తనలోని ఊహించని సరదా, ఎనర్జిటిక్ వైపును చూపించారు. ఈ ఒక్క స్టెప్‌తోనే 'కుబేర'పై అంచనాలు మరింత పెరిగాయి. సినిమాలో ఇంకా ఏం మ్యాజిక్ దాగి ఉందో చూడాలని ప్రేక్షకులు ఇప్పుడు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.