టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకప్పటి నటి శ్రియా శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శ్రియ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో చాలా సాంప్రదాయంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటించేది. ఇక ఇప్పుడు పూర్తిగా ఎక్స్పోజింగ్ పాత్రలు చేసుకుంటూ తన సత్తాను చాటుతోంది. ఈ చిన్నది అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన శ్రియ ఇప్పటికీ వరుసగా సినిమాలు చేసుకుంటూ తన హవాను కొనసాగిస్తోంది. 

శ్రియ తెలుగులోనే కాకుండా హిందీలోనూ అనేక సినిమాలలో నటిస్తోంది. ఇక ఈ చిన్నది వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాల పరంగా తన కెరీర్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న సమయంలోనే ఈ బ్యూటీ ఆండ్రూ కొచ్చివ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ ఆడబిడ్డ కూడా జన్మించింది. ఇక వివాహం చేసుకొని తల్లి అయినప్పటికీ శ్రియ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ అగ్రశ్రేణి హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ శ్రియ చాల యాక్టివ్ గా ఉంటుంది.

తనకు, తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. ఈ క్రమంలోనే శ్రియాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారింది. శ్రియ హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రియా 42 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధపడిందట. ఈ విషయం తెలిసి కొంతమంది అభిమానులు 42 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్ చేయడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపై శ్రీయ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: