స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి పరిచయం అనవసరం. ఈ మధ్యకాలంలో ఈయన చాలా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్ స్టెప్పుల గురించి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో అది దా సర్ ప్రైస్ సాంగ్ కి డ్యాన్స్ ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్ హుక్ స్టెప్పుపైన చాలా కాంట్రవర్సీ జరిగింది. దీంతో సినిమాలో ఆ సస్టెప్పును కనిపించకుండా చేశారు.
 
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి, ఫోక్ డాన్సర్ జాను లిరికి మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరికి లింక్ ఉందంటూ చాలా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీని గురించి శేఖర్ మాస్టర్ స్పందించారు. జాను లిరికి, తనకి ఏదో సంబంధం ఉన్నట్టు పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆమె మంచి డాన్సర్.. అలాగే ఆమెకు చాలా టాలెంట్ ఉందని జాను లిరిని మెచ్చుకున్నట్లు తెలిపారు. ఒక్క డాన్స్ షోలో తనని డాన్స్ బాగుందని మెచ్చుకున్నంత మాత్రన.. వారిద్దరికీ సంబంధం ఉందంటూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని శేఖర్ మాస్టర్ బాధపడ్డారు.

 
తను చాలా షోల్లో ఎంతోమంది అబ్బాయిలని, అమ్మాయిలని ఇదే విధంగా పొగిడారని అన్నారు. జాను లిరికి టాలెంట్ ఉంది కాబట్టే తను విన్నర్ అయిందని స్పష్టం చేశారు. తనేదో కావాలని విన్నర్ చేశానని అందరూ అంటున్నారని.. తనకి నాకు మధ్య లింక్ ఉందంటూ మాట్లాడుతున్నారని అన్నారు. వారిద్దరికీ ఫ్యామిలీస్ ఉన్నాయని తెలిపారు. షో అయిపోయాక తనెవరో, మళ్లీ షో తర్వాత ఎప్పుడు మేమిద్దరం అసలు మాట్లాడుకోలేదని శేఖర్ మాస్టర్ వెల్లడించారు. నిజంగా మా మధ్య ఏదైనా ఉంటే మాట్లాడుకున్న ఏం పర్లేదు కానీ, ఏమీ లేనప్పుడు ఇలా ప్రచారం చేయడం తప్పంటూ శేఖర్ మాస్టర్ ఖండించారు. తన ఇన్ స్టా పేజీలో కూడా జాను గురించే ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారని.. అలాంటి కామెంట్లు చూసినప్పుడు చాలా బాధేస్తుందని మాస్టర్ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: