
మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" సినిమాతోనే ఆమె పెద్ద సినిమాలలో నటించడానికి అవకాశాలు అందుకుంటూ వచ్చింది. కాగా రీసెంట్ గానే వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ మరొక హీరోయిన్గా మీనాక్షి చౌదరి ఇంకో హీరోయిన్గా నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . ఈ సినిమా ఆమె కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆమెకు బోలెడు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆమె మాత్రం ఆ సినిమాలకు కమిట్ అవ్వడం లేదు .
దానికి కారణం అన్నీ కూడా ట్రెడిషనల్ పాత్రలే అంటూ ఆమె అసహన వ్యక్తం చేస్తుంది. మీనాక్షి చౌదరికి ట్రెండీ పాత్రల్లో కూడా నటించాలి అన్న కోరిక ఉందట. ముఖ్యంగా యాక్షన్ సినిమాలల్లో నటించాలి అని ఉందట. అంతేకాదు ఎప్పుడు కూడా ఒకే టైప్ అఫ్ జోనర్ లో సినిమాలు చేయకూడదు అని .. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో నటించాలి అని ఆమె కోరుకుంటుంది. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది . అయితే ప్రెసెంట్ మీనాక్షి చౌదరికి వస్తున్న కాన్సెప్ట్ అన్ని కూడా ఒకే విధంగా ఉంటున్నాయట . ఒకే కాన్సెప్ట్ లో ఎన్ని సార్లు నటించిన ఏం లాభం అంటూ ఆమె ఆ సినిమాలని రిజెక్ట్ చేస్తూ వస్తుందట . దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయిన మీనాక్షి చౌదరికి లాభం లేకుండా పోయింది..!