టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది నటీమణులతో ఆడి పాడాడు . ఇకపోతే బాలకృష్ణ అనేకం సార్లు అనేక మంది హీరోయిన్లను తన సినిమాల్లో రిపీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి . కానీ బాలకృష్ణ , విజయశాంతి తో మాత్రం అత్యంత ఎక్కువ సినిమాలు చేశాడు. ఇకపోతే బాలకృష్ణ , విజయశాంతి కాంబోలో మొత్తం 17 సినిమాలు వచ్చాయి. అందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. మొదటగా వీరి కాంబోలో కథానాయకుడు అనే సినిమా వచ్చింది. ఇక ఆఖరుగా వీరి కాంబోలో నిప్పు రవ్వ అనే సినిమా వచ్చింది. నిప్పు రవ్వ అనే సినిమా తర్వాత వీరి కాంబోలో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఇకపోతే ఇప్పటి వరకు వీరి కాంబో లో వచ్చిన ఆ 17 సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసు కుందాం.

1 . కథానాయకుడు

2 . పట్టాభిషేకం

3 . ముద్దుల కృష్ణయ్య

4 . వంశోద్ధారకుడు

5 . అపూర్వ సహోదరులు 

6 . భార్గవ రాముడు

7 . సాహస సామ్రాట్ 

8 . మువ్వ గోపాలుడు

9 . భానుమతి గారి మొగుడు

10 . ఇన్స్పెక్టర్ ప్రతాప్ 

11 . భలే దొంగ

12 . ముద్దుల మామయ్య 

13 . ముద్దుల మేనల్లుడు

14 . లారీ డ్రైవర్ 

15 . తల్లిదండ్రులు

16 . రౌడీ ఇన్స్పెక్టర్ 

17 . నిప్పురవ్వ

ఇలా ఇప్పటి వరకు నందమూరి నట సింహం బాలకృష్ణ , అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విజయశాంతి కాంబినేషన్ లో మొత్తం 17 సినిమాలు వచ్చాయి. అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాలను కూడా అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: