నందమూరి బాలకృష్ణ తాజాగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ విషయం విన్న అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ రోజున ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డు అందుకోవడం జరిగింది. అయితే ఈ వేడుకకు బాలయ్య పంచకట్టులో వెళ్లి మరి అందరిని ఆకట్టుకున్నారు. బాలకృష్ణ సినీ రంగంలో విశేషంగా సేవలు అందించినందుకుగాను బాలయ్యకు ఈ పద్మభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వేడుకకు సైతం బాలకృష్ణ కుటుంబ సభ్యులకు కూడా తరలిరావడం గమనార్హం.



బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా అటు రాజకీయా నాయకుడిగా,నిర్మాతగా ,సమాజ సేవకుడిగా కూడా చాలా కృషి చేశారు. అందుకని బాలకృష్ణకు ఈ అవార్డును ఎంపిక చేయడం జరిగింది. ఎన్టీఆర్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఇప్పటికే వందకు పైగా చిత్రాలలో నటించి అభిమానులను మెప్పించారు. ఈ వయసులో కూడా బాలయ్య కుర్ర హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ సక్సెస్ అందుకుంటూ ఉన్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో కూడా నటించిన బాలకృష్ణ తన తండ్రిలాగే పారాణిక పాత్రలలో కూడా చేయడానికి ఇష్టపడుతున్నారు.



బాలకృష్ణ అటు మాస్ క్లాస్ ఆడియన్స్ ని అలరిస్తూనే సినిమాలలో తనదైన బ్రాండ్ ఏర్పరచుకున్నారు. బాలయ్య ఇప్పటికే ఎన్నో అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు తాజాగా భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పద్మభూషణ్ అవార్డు కూడా అందుకొని అటు సినీ ప్రముఖులతో కూడా ప్రశంశాలు అందుకుంటున్నారు. ఈ ఫోటోలు చూసిన బాలయ్య అభిమానులు కూడా ప్రత్యేకంగా విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ రోజున బాలకృష్ణకు చాలా ప్రత్యేకమైన రోజుగా అభిమానులు భావిస్తున్నారు. బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. పలు చిత్రాలను లైన్ లో పెట్టారు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: