ఉపాసన ఓ హీరోయిన్ కాదు ..ఒక రాజకీయనేత కాదు.. కానీ ఉపాసన పేరుకి ఉన్న క్రేజ్ పబ్లిసిటీ ఓ పాన్ ఇండియా హీరోకి కూడా ఉండదనే చెప్పాలి . సాధారణంగా స్టార్ హీరోస్ అంటే ఎక్కువగా సినిమాలు చేయడం వల్ల ఆ క్రేజ్ సంపాదించుకుంటారు.  వాళ్ళ సినిమాలు ఎంటర్టైనింగ్ గా ఉండడం వల్ల ఫ్యాన్ బేస్ పెరుగుతుంది.  కానీ ఉపాసన అలా కాదు కేవలం ప్రజాసేవ చేసి తన పేరుని హైలెట్ గా ట్రెండ్ అయ్యే విధంగా మార్చుకుంటుంది . మరీ ముఖ్యంగా ఉమెన్స్ కి హెల్త్ పట్ల ఉండాల్సిన కొన్ని కొన్ని అవగాహనలు తీసుకొస్తూ ఉంటుంది .


రామ్ చరణ్ భార్య కావడం వల్ల ఆమె పేరు మరింత స్థాయిలో ట్రెండ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు.  ఒకపక్క మెగా ఇంటి కోడలుగా మరొక పక్క అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలిగా ఉపాసన పేరు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎప్పుడు టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది . కాగా ఉపాసన ఎంత స్టార్ సెలబ్రిటీ అయిన కొన్ని కొన్ని విషయాలలో చాలా కఠినంగా ఉంటుందట . సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ లగ్జరీ లైఫ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు.  కానీ ఉపాసన ప్రతి రూపాయి విషయంలో చాలా కేర్ఫుల్ గా స్టెప్ వేసుకుంటుందట .



ఎక్కడికి వెళ్లినా సరే లిమిట్స్ కి మించి అస్సలు ఖర్చు చేయదట . ఆ బడ్జెట్ ఎంతో అంతకి ఆమె డబ్బులు ఖర్చు పెడుతుందట . అంతేకాదు ఉపాసన మొదటి నుంచి ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది . చాలా హెల్తీగా స్ట్రాంగ్ గా ఉండాలి అనేది ఉపాసన అభిప్రాయం . ఆ కారణంగానే డైట్ ను ఎక్కువగా ఫాలో అవుతుందట.  కేవలం ఆమె డైట్ ఫాలో అవ్వడం కాదు ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా డైట్ ఫాలో అయ్యేలా చేస్తుందట.  మరీ ముఖ్యంగా రామ్ చరణ్  డైట్ విషయంలో ఉపాసన ఒక్కసారి కూడా కాంప్రమైజ్ అవ్వదట.


అంతేకాదు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా ఏదైనా ఈవెంట్ కి వెళ్లిన తెలిసిన వాళ్ళు డిన్నర్ కి ఇన్వైట్ చేసిన ఉపాసన ముందు ఫుడ్ తినాలి అంటే రామ్ చరణ్ కి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుందట . ఉపాసన ప్రతి విషయాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని తింటుందట . కేలరీస్ కౌంట్ బేస్ చేసుకుని ఉపాసన ప్రతి ఫుడ్ ని తింటుందట . అయితే రామ్ చరణ్ మాత్రం మంచి ఫుడి పెళ్లికాకముందు వరకు ఎలా పడితే అలా తినేసేవాడట . కానీ పెళ్లి తర్వాత మాత్రం పూర్తిగా ఉపాసన కంట్రోల్ లోకి చరణ్ డైట్ వెళ్ళిపోయింది.  అందుకే ఆయన ఏది కూడా ఉపాసన ముందు ఫ్రీగా తినలేరట..!

మరింత సమాచారం తెలుసుకోండి: