తెలుగు బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న జ్యోతి రాయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ ద్వారా కూడా మరింత క్రేజీ సంపాదించుకొని పలు సీరియల్స్ లో భారీ క్రేజ్ అందుకుంది. అయితే అప్పటికి వివాహమైన ఈమె తన అందం, అభినయంతో ఫిజిక్ తో సోషల్ మీడియాలో యూత్ ను తెగ అట్రాక్ట్ చేసేలా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జ్యోతి రాయ్ సాంప్రదాయమైన పద్ధతిలో సీరియల్ లో కనిపించినప్పటికీ కానీ సోషల్ మీడియాలో మాత్రం హిటెక్కించేలా కనిపిస్తూ ఉంటుంది.


అయితే కొన్ని కారణాల చేత సీరియల్ నుంచి మధ్యలో తప్పుకున్నప్పటికీ ప్రస్తుతం హీరోయిన్గా తన అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అటు తన సినిమా ప్రమోషన్స్ తో పాటుగా గ్లామర్ ఫోటోలతో నిరంతరం హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం కిల్లర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ చిత్ర బృందం విడుదల చేయగా ఇందులో కూడా తన గ్లామర్ తో అలరించడమే కాకుండా నటనతో కూడా అలరించిందన్నట్లుగా అభిమానులు తెలియజేస్తున్నారు.


గ్లింప్స్ విషయానికి వస్తే వైమానిక శాస్త్రం అనే ఒక కాన్సెప్ట్ ఆధారంగా కిల్లర్ సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రోబో తరహా పాత్రలో కూడా కనిపించబోతున్నట్లు తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే మనకి అర్థమవుతుంది ఇందులో ఈమె యాక్టింగ్ కూడా అదరగొట్టినట్లు కనిపిస్తోంది.సైన్స్ ఫిక్షన్ సినిమాతో పాటు మైథాలజికల్ సినిమా అన్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అన్ని వివరాలను కూడా అనౌన్స్మెంట్ చేయబోతోంది చిత్ర బృందం. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. గడిచిన కొన్ని నెలల క్రితం అటు జ్యోతిరాయ్ , పూర్వజ్ ఇద్దరు ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. వివాహమనంతరం మొదటిసారి హీరోయిన్గా నటిస్తోంది జ్యోతి రాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: