నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించాలంటే నటన, అందం మాత్రమే కాదు అదృష్టం కూడా ఉండాలి. ఈ మూడు కలిసి వస్తేనే హీరోయిన్లుగా సక్సెస్ అవుతారు. అలాంటి వారిలో నటి సమంత ముందు వరుసలో నిలిచింది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమా అనంతరం ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. 

ఈ మధ్యకాలంలో తెలుగుతోపాటు హిందీలోనూ నటిస్తూ గుర్తింపు అందుకుంటుంది. సమంత హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారారు. నిర్మాణ రంగంలో అడుగుపెట్టి శుభం సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. శుభం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న వైజాగ్ లో నిర్వహించారు. ఆ ఈవెంట్ లో భాగంగా సమంత మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. మజిలీ సినిమా నుంచి ఓ బేబీ, రంగస్థలం సినిమాల వరకు విశాఖపట్నం వచ్చిన ప్రతిసారి తనకు మంచి విజయాన్ని అభిమానులు ఇచ్చారని సమంత అన్నారు. 

శుభం సినిమాతో తనకు మరోసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇస్తారని అనుకుంటున్నట్లుగా సమంత తెలిపారు. ఏ మాయ చేసావే సినిమాలో నటించిన అనంతరం వైజాగ్ అభిమానుల ప్రేమను నిజంగా చూశానని సమంత అన్నారు. అప్పటినుంచి వైజాగ్ ప్రజలతో గట్టి బంధాన్ని ఏర్పరచుకున్నట్లుగా సమంత తన మనసులో ఉన్న మాటలను బయటపెట్టారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించినందుకు చాలా సం తోషంగా ఉందని సమంత అన్నారు. ఇక ఈ సినిమా మే 7వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: