ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర సినిమా ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీదేవిమూవీ లో హీరోయిన్గా నటించగా ... దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఇక అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను మే 9 వ తేదీన భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన ప్రచారాలను కూడా ఈ మూవీ బృందం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు "సింగిల్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 9 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఇలా సింగల్ మూవీ విడుదల కానున్న రోజే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ కానుంది. మరి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ వల్ల శ్రీ విష్ణు హీరో గా రూపొందిన సింగిల్ మూవీ కలెక్షన్ లపై ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మరి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ వల్ల సింగిల్ మూవీ కలెక్షన్ లపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: