టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లలో మైత్రీ, సితార, ఎస్వీసీ ముందువరసలో ఉన్నాయి. ఈ మూడు బ్యానర్లు వేటికవే ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి బాబీ కాంబో సినిమాతో కర్ణాటకకు చెందిన క్రేజీ బ్యానర్ కేవీఎన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ బ్యానర్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
 
చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. డాకు మహారాజ్ సినిమాతో సైతం బాబీ సక్సెస్ సాధించినా సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం ముందు ఆ సినిమా తేలిపోయింది. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవి పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
 
మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు 75 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చిరంజీవి రేంజ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి కెరీర్ పరంగా మరిన్ని మెట్లు పైకి ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాబీకి చిరంజీవి ఛాన్స్ బెస్ట్ ఛాన్స్ అవుతుందని చెప్పవచ్చు.
 
చిరంజీవి బాబీ కాంబో టాలీవుడ్ ఇండస్ట్రీ బెస్ట్ కాంబినేషన్లలో ఒకటని చెప్పవచ్చు. డైరెక్టర్ బాబీ తన సినిమాలలో ఎక్కువ సినిమాలను సీనియర్ హీరోలతో తెరకెక్కిస్తున్నారు. బాబీ భవిష్యత్తు సినిమాలు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి బాబీ కాంబో రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సీనియర్ హీరోలలో చిరంజీవికి తిరుగులేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: