సినీ నటుడు సుమంత్ అనగనగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్ గా నటించింది. అనగనగా సినిమాలో అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేష్ రాచకొండ ముఖ్య పాత్రలలో కనిపించారు. ఈ మూవీకి డైరెక్టర్ సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు రాకేష్ రెడ్డి గడ్డం, రుద్ర మదిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు చందు రవి సంగీతం అందించారు.

ఈ సినిమాలో (సుమంత్) వ్యాస్ అనే పాత్రను పోషించారు. వ్యాస్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ గా పనిచేస్తారు. అదే స్కూల్ కి వ్యాస్ భార్య భాగ్య (కాజల్ చౌదరి) ప్రిన్సిపాల్ గా ఉంటుంది. బట్టీ చదువులు మంచిది కాదని పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పాలని నిత్యం స్కూల్ యజమాన్యంతో వాదిస్తూ ఉంటాడు. అలా వాదిస్తూ ఉద్యోగం కూడా కోల్పోతాడు. భార్య ప్రిన్సిపల్ అయినప్పటికీ మేనేజ్మెంట్ మాటకు కట్టుబడి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయిన వ్యాస్ ఏం చేశాడని.. చదువులో వెనుకబడిన స్కూల్ పిల్లలని ఎలా టాపర్ లుగా తీర్చిదిద్దాడనేది ఈ సినిమా కథ.


ఈ సినిమాలో సుమంత్, వ్యాస్ పాత్రలో ఎంతో సహజంగా నటించారు. భార్య పాత్రలో నటించిన కాజల్ చౌదరి కూడా ఆ పాత్రకి చక్కగా సరిపోయారు. ఆమె చీరకట్టులో తెలుగింటి ఆడవారిని గుర్తుచేసుకునేలా ఉంది. అవసరాల శ్రీనివాస్, అనూ హాసన్, రాకేష్ రాచకొండ తదితరుల పాత్రలు కూడా బాగా నటించి మెప్పించాయి. ఈ సినిమాలో సంగీతం కూడా ఓకే అనిపించింది. ఈ సినిమాను చాలా తక్కువ లొకేషన్స్ లో షూట్ చేసినట్లు అనిపించింది. అయినప్పటికీ ప్రతి ఫ్రేమ్ లను ఎంతో అందంగా చూపించారు. డైరెక్టర్ కొన్ని ట్విస్ట్ లను పెట్టారు.. అవి చాలా బాగున్నాయి. ఈ సినిమా ఇప్పుడున్న ప్రజలకు చాలా చాలా అవసరం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది. ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండాయి. ఫస్ట్ ఆఫ్ సన్నివేశాలు పర్వాలేదు అనిపించాయి. కానీ సెకండాఫ్ లో మాత్రం కొన్ని సన్నివేశాలు అనవసరంగా పెట్టారనిపించేలా ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఈటీవీ వీన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.













మరింత సమాచారం తెలుసుకోండి: