నందమూరి నట సింహం బాలకృష్ణ కెరియర్లో కొన్ని సంవత్సరాల క్రితం బి గోపాల్ దర్శకత్వంలో హరిహర మహాదేవ్ అనే సినిమా అధికారికంగా ప్రారంభం అయింది. ఆ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాని స్టార్ట్ చేశారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా బాలకృష్ణ గారితో ప్లాన్ చేసిన హరహర మహాదేవ్ సినిమా ఎందుకు ఆగిపోయింది అనే కారణాలను ఆయన చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా బి.గోపాల్ మాట్లాడుతూ ... బాలకృష్ణ హీరోగా హర హర మహదేవ్ అనే సినిమాను చేయాలి అనుకున్నాం.

కాకపోతే ఆ సినిమాను లాంచింగ్ చేసే సమయానికి మా దగ్గర కథ లేదు. ఆ సినిమాకు సురేష్ బాబు నిర్మాత. ఆయన ఒక కథ రచయిత దగ్గర ఒక మంచి కథ ఉంది. దానితో సినిమా చేద్దాం అని అన్నాడు. దానితో ఆ మూవీ ని లాంచ్ చేశాం. ఆ తర్వాత ఆ కథ రచయిత చెప్పిన కథ మాకు పెద్దగా నచ్చలేదు. ఆ తర్వాత మరి కొంత మంది రైటర్స్ ను కలిసి వారు ఏదైనా మంచి కథ ఇస్తే దానితో సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ ఏ రైటర్ చెప్పిన కథ కూడా పెద్దగా నచ్చలేదు. దానితో సరైన కథ లేనప్పుడు సినిమా ఆపివేయడం బెటర్ అని చెప్పి ఆ మూవీ ని ఆపివేశం అని బి గోపాల్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

ఇకపోతే బాలకృష్ణ , బి గోపాల్ కాంబోలో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ , సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు , పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమాలు వచ్చాయి. ఇందులో పలనాటి బ్రహ్మనాయుడు సినిమాని మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: