ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో సాయి శ్రీనివాస్. అల్లుడు శ్రీను సినిమాతో సాయి శ్రీనివాస్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో స్టార్ హీరో రేంజ్ సినిమాలా నిర్మించారు. ఈ సినిమా తరవాత పలు చిత్రాల్లో సాయి శ్రీనివాస్ నటించాడు. ఇక తాజాగా భైరవం సినిమాలో నటించాడు. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. 

గరుడన్ అనే తమిళ సినిమా రీమేక్ గా ఈ సినిమాను తెరక్కించారు. నిన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలవగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో హీరోలు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు ముందు తరవాత ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. తానేమీ స్టార్ హీరో కొడుకును కాదని ఇండస్ట్రీలోకి స్వతహాగా వచ్చానని చెప్పారు.

ప్రొడ్యూసర్ కొడుకు అయినంత మాత్రాన నెపోకిడ్స్ అయిపోరని అన్నారు. స్టార్ హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని, వాళ్ల కొడుకులను నెపోకిడ్స్ అంటారని వ్యాఖ్యానించాడు. మా నాన్న ప్రొడ్యూసర్ అయినా క్రెడిబులిటీ సంపాదించుకోవాలి అంటే కష్టపడాల్సిందే అని చెప్పారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని అన్నారు. హిందీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని ఎగిరి గంతేశానని అన్నారు. తన జనరేషన్ లో రానా, రామ్ చరణ్ మాత్రమే బాలీవుడ్ లో సినిమాలు చేశారని చెప్పారు. రామ్ చరణ్ హిందీ సినిమా జంజీర్ రీమేక్ చేస్తే తాను సౌత్ సినిమా ఛత్రపతి రీమేక్ చేశానని అన్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ హీరోలపై స్టార్ హీరోల వారసులు స్పందిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: