అన్న నందమూరి తారక రామారావు... ముద్దుల మనవడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి కుటుంబంలో... జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ ఏ హీరోకు లేదని చెప్పవచ్చు. అంతలా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.  జక్కన్న చేతిలో పడ్డ తర్వాత... జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఓ రేంజ్ కి వెళ్ళిపోయింది.

 టాలీవుడ్ ఇండస్ట్రీలో  RRR సినిమా ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని సినిమాలను దాటుకొని ఆస్కార్ రేంజ్ కి కూడా వెళ్ళింది. అలాంటి ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించడంతో అతని కెరీర్ కూడా బాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్సినిమా చేసిన... మంచి క్రేజ్ లభిస్తుంది. అయితే అలాంటి మహోన్నత నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

 జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే హవా అంతా ఇంతా కాదు. రక్తాలు చిందిస్తారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. నేటితో 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. గత బర్త్డే సమయంలో ఫారన్ కు వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు హైదరాబాదులోనే ఉన్నట్లు తెలుస్తోంది.  ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఇవాళ ఉన్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన సినిమా అప్డేట్లు వరుసగా రాబోతున్నాయి.

 అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియోను సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వాడుకుంటుంది. తమ సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను.. వైరల్ చేస్తుంది సన్రైజర్స్ హైదరాబాద్. మీకు ఏ ఐపీఎల్ జట్టు అంటే ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ను గతంలో అడిగిన ఓ వీడియోను బయటపెట్టారు. అందులో తనకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే చాలా ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు.. తెలుగోడు తెలుగు జట్టుకు మాత్రమే సపోర్ట్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఆ వీడియో ను ఎన్టీఆర్ బర్త్డే రోజు వైరల్ చేస్తుంది హైదరాబాద్ యాజమాన్యం. అయితే తమ అధికారిక అకౌంట్లో కాకుండా  ప్రవేట్ అకౌంట్స్  లలో వైరల్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: