యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్2 మూవీ నుంచి నేడు గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. 95 సెకన్ల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్ అటు హృతిక్ అభిమానులను, ఇటు ఎన్టీఆర్ అభిమానులను మెప్పించేలా ఉంది. "నా కళ్లు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతూనే ఉన్నాయ్ కబీర్" అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ఈ గ్లింప్స్ మొదలైంది.
 
"ఇండియా బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే కానీ ఇప్పుడు కాదు" అంటూ తారక్ చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కు హైలెట్ గా నిలిచింది. కబీర్ ను పట్టుకునే పాత్రలో తారక్ పవర్ ఫుల్ గా కనిపించారు. గ్లింప్స్ లో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేయడం గమనార్హం. గ్లింప్స్ లో తారక్ కళ్లు వేటాడే పులి కళ్లలా ఉన్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ గ్లింప్స్ విడుదల కావడం గమనార్హం.
 
హృతిక్, తారక్ మధ్య ఫేసాఫ్ సీన్లు గ్లింప్స్ కు హైలెట్ గా నిలిచాయి. ఈ షాట్ కు ప్రేక్షకులకు సినిమా పైసా వసూల్ అనిపించడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. గ్లింప్స్ లో కియారా అద్వానీ బికినీలో కొన్ని సెకన్ల పాటు కనిపించారు. ఈ గ్లింప్స్ మాత్రం న భూతో న భవిష్యత్ అనేలా వేరే లెవెల్ లో ఉంది. తారక్ రోల్ నెగిటివ్ రోల్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
 
గ్లింప్స్ లో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ లెవెల్ లో ఉన్నాయని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. హిందీ ప్రేక్షకుల నుంచి సైతం ఈ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గ్లింప్స్ లో తారక్ లుక్స్ అదిరిపోయాయి. ఈ ఏడాది ఆగష్టు నెల 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: