
దానికి కారణం వారిద్దరూ కూడా ఈ మధ్య మీడియా ముందు కనిపించకపోవడమే. అయితే ఆ వార్తలకు ఐశ్వర్యరాయ్ తాజాగా పులిస్టాప్ పెట్టింది. విడాకుల వార్తలపై స్పందించకుండనే ప్రపంచ సుందరి తాను తన భర్తతో విడిపోవడం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కేన్స్ 2025 వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు ఐశ్ కూడా వచ్చింది. రాణి మాదిరిగా తెల్లటి చీరలో మెరుస్తూ తన ఎంట్రీతో అదరగొట్టింది. అంతే కాకుండా మెడలో రెడ్ నెక్లెస్ తో మెరిసిపోయింది. మరోవైపు ఆమె నుదిటిన సిందూరంతో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐశ్ కారు దిగిన సమయం నుండి అభిమానులు అంతా ఐశ్ ఐష్ అని అరుస్తూనే ఉన్నారు. వారు అరుపులు కేకల మధ్య ఓ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చింది.
అయితే సాధారణంగా ముత్తైదువులే నుదిటిన సిందూరం పెట్టుకుంటారు. ప్రపంచ సుందరి విడాకులు తీసుకునే అవకాశం ఉంటే అస్సలు ఆ లుక్ లో కనిపించరు. కాబట్టి ఆమె విడాకుల వార్తలను కొట్టిపారేయడానికే ఇలాంటి లుక్ లో కనిపించారని ప్రచారం జరుగుతోంది. ఒక్క లుక్ తో ఆమె అన్ని వార్తలకు పులిస్టాప్ పెట్టిందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు చాలా కాలం పాటూ ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉన్నారు. పెళ్లి తరవాత ఐశ్వర్య తన పూర్తి సమయం ఫ్యామిలీతోనే గడిపింది. ఇప్పుడు కూడా సినిమాలకు కాస్త దూరంగానే ఉన్నట్టు కనిపిస్తోంది.