పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే .. క్రిష్ , జ్యోతి కృష్ణ తెర‌క్కికేస్తున్న ఈస్టారికల్ ఎపిక్ మూవీ తాజాగా ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టేసింది .. ఇప్పటికే ఈ సినిమా లోని మూడో పాట‌ని కూడా తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .. అయితే ఇప్పుడు ఈ సినిమా పై భారీ అంచనాలైతే ఉండగా భారీ స్థాయి లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపిస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద అంతు చిక్కని ప్రశ్నగా మారింది ..


 ఒకవైపు ఓజీ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే .  మరో వైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు .. ఇలా నిత్యం ఎంతో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ .. వీరమల్లు ప్రమోషన్స్ లో ఒక్కసారి కనిపిస్తే చాలు అని అభిమానులు ఎంత గానో ఆశపడుతున్నారు .. స్టార్‌ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా , బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా కి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీత మందిస్తున్నారు .. ఇప్పటికే ఈ సినిమా పలుసార్లు వాయిదా పడి .. ఇక ఇప్పుడు వచ్చే నెల జూన్ 12న ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీగా ఉంది ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9705876414 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: