టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  విషాదం నెలకొంది. `బలగం` చిత్రంలో హీరో ప్రియదర్శికి చిన్న తాత అంజన్న పాత్ర పోషించి ప్రేక్షకులకు చేరువైన నటుడు, ప్రముఖ కళాకారుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి జీవీ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీలు తీవ్రంగా దెబ్బ తినడంతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. డయాలసిస్, తదితర ట్రీట్మెంట్స్‌ నేపథ్యంలో ఆయన ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. మందులు కొన‌డానికి కూడా డ‌బ్బులు లేని ప‌రిస్థితుల్లో బలగం దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి వంటి వారు కొంత ఆర్థిక సాయం అందించారు.


అయినప్పటికీ జీవీ బాబు ఆరోగ్యం మెరుగుపడలేదు. తాజాగా మరింత విషమించడంతో ఆయన ఆదివారం ఉద‌యం కన్నుమూశారు ఈ విషయం తెలుసుకున్న వేణు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. `జీవీ బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోకే గడిపారు. చివరి రోజుల్లో ఆయనను బలగం మూవీతో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను` అంటూ వేణు పోస్ట్ పెట్టారు.



బ‌ల‌డం టీమ్‌తో పాటు మ‌రికొంద‌రు సినీప్రముఖులు జీవీ బాబు మృతి పై సంతానం తెలుపుతున్నారు. కాగా, వేణు దర్శకుడుగా పరిచయం అవుతూ ప్రియదర్శి హీరోగా నటించిన `బలగం` చిత్రం 2023లో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ సాధించింది. బలగంలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపుతో పాటు మరిన్ని అవకాశాలు కూడా తలుపు తడుతున్నాయి. రంగస్థలం కళాకారుడు జీవీ బాబు కూడా బలగం మూవీతోనే వెండితెరపై అడుగు పెట్టారు. ఇందులో కథను ముందుకు నడిపించే అంజన్న పాత్రలో ఆయన అలరించారు. తాజాగా జీవీ బాబు మృతిచెందడంతో బలగం చిత్ర బంధం విషాదంలో మునిగిపోయింది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: