
ఇకపోతే అనగనగా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్.. గతంలో `నువ్వే కావాలి` మూవీని వదులుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళ చిత్రం `నిరం` స్ఫూర్తిగా కె. విజయ భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ `నువ్వే కావాలి`. ఈ మూవీతో తరుణ్ హీరోగా పరిచయం అయ్యాడు. రిచా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. 2000వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
కథానాయకుడిగా డెబ్యూతోనే తరుణ్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. అయితే నిర్మాత స్రవంతి రవికిషోర్ నువ్వే కావాలి సినిమాను మొదట సుమంత్ తో తీయాలని భావించారు. అందులో భాగంగానే సుమంత్ ను సంప్రదించగా.. ఆయన నో చెప్పారు. దాంతో నువ్వే కావాలి చేసే అవకాశం తరుణ్ కు దక్కింది. అయితే ఈ సినిమాను వదులుకుని పెద్ద తప్పు చేశానని.. అందుకు ఇప్పటికీ బాధపడతానని సుమంత్ పేర్కొన్నాడు.
సమంత మాట్లాడుతూ.. ``నా కెరీర అప్పుడే స్టార్ట్ అయింది. స్రవంతి రవి కిషోర్ గారు `నువ్వే కావాలి` ఆఫర్ ఇచ్చారు. అయితే అదే టైమ్ లో `యువకుడు`, `పెళ్లి సంబంధం` సినిమాలు చేస్తున్నాను. డేట్స్ సర్దుబాటు కాక నువ్వే కావాలి చేయలేకపోయాను. నా కెరీర్ లో అవకాశం వచ్చిన చేయలేకపోయిన సినిమా అదొక్కటే. నువ్వే కావాలి వదులుకున్నందుకు ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను` అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా నువ్వే కావాలి సినిమా సుమంత్ ఖాతాలో పడి ఉంటే ఆయన కెరీర్ మరోలా ఉండేది అనడంలో సందేహం లేదు.