ప్రజెంట్‌ టాప్‌ హీరోలందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో మూవీని పట్టాలెక్కించేస్తున్నారు . ఎట్‌ లీస్ట్‌.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటన్న విషయం లో క్లారిటీ అయినా ఇస్తున్నారు . కానీ ఒక్క మహేష్‌ ఈ విషయంలో కోంత‌ సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు . భారీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సూపర్ స్టార్ , నెక్ట్స్ మూవీ ఇంకా రివీల్ చేయటం లేదు .
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ రెండు , మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు .. సెట్స్‌ మీద ఉన్న సినిమా తర్వాత ఏం చేస్తారన్న విషయం లో ఫుల్ క్లారిటీ తో ఉన్నారు ..


పెద్ది వర్క్ లో బిజీ గా ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ సుకుమార్ సినిమా చేస్తానని ప్రకటించారు .. డ్రాగన్ షూట్ లో ఉన్న ఎన్టీఆర్ తర్వాత దేవర 2 షూటింగ్లో అడుగు పెడతారు . ఇక‌ అట్లీ సినిమా షూటింగ్ మొదలు కాకపోయినా నెక్స్ట్ సినిమా విషయం లో ఫుల్ క్లారిటీగా ఉన్నారు .. ఏఏ 22 ప్లేస్‌లో చేయాల్సిన త్రివిక్రమ్ సినిమానే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం గట్టిగా కనిపిస్తుంది ..


ఇక పాన్‌ ఇండియా హీరో ప్రభాస్  విషయంలో  అయితే వరుస‌ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి .. అయితే ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయం లో కొంత సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది .. రాజమౌళి సినిమా తో బిజీగా ఉన్న మహేష్ బాబు ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారు అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు . మహేష్ కూడా ఈ విషయం లో ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు .. SSMB 29 మూవీ గ్లోబల్ రేంజ్ లో రావటం తో ఈ సినిమా పూర్తి అయిన తర్వాతే తర్వాత సినిమా గురించి ఆలోచించాలని భావిస్తున్నారు సూపర్ స్టార్ .

మరింత సమాచారం తెలుసుకోండి: