రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రజనీకాంత్ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ నటితో ప్రేమలో పడ్డాడు. అంతేకాకుండా ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నప్పటికీ వీరి వివాహం జరగలేదు. కొన్ని సమస్యల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత రజనీకాంత్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నప్పటికీ ఆ హీరోయిన్ మాత్రం వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. 

హీరోయిన్ మరెవరో కాదు సిల్క్ స్మిత. ఈ అమ్మడు తనదైన నటనతో, నృత్యాలతో దక్షిణాది సినీ పరిశ్రమను తన వైపుకు తిప్పుకుంది. సిల్క్ స్మిత అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. 30 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకుని సినీ పరిశ్రమకు వీడ్కోలు పలికింది. సిల్క్ స్మితకు రజనీకాంత్ అంటే విపరీతంగా ఇష్టం. మొదట అతనితో ఒక్క సినిమాలో నటిస్తే చాలని అనుకుంది. అనంతరం అనేక సినిమాలలో సిల్క్ స్మిత రజనీకాంత్ తో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనే ప్రకాల వార్తలు కూడా వైరల్ అయ్యాయి. సినీ పరిశ్రమలో కూడా ప్రతి ఒక్కరూ వీరి ప్రేమ వ్యవహారం నిజమేనని అనుకున్నారు. కానీ కొంతమంది మాత్రం వీరి ప్రేమ విషయంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఇక సిల్క్ స్మిత అపస్మారక స్థితిలో మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. సిల్క్ స్మిత భారీగా డబ్బులు సంపాదించింది.

అయినప్పటికీ ఎవరూ లేకుండా ఒంటరిదానిలా మిగిలిపోయింది. సిల్క్ స్మితకు విపరీతంగా అభిమానులు ఉండేవారు. తాను నటించిన సినిమా వస్తుందంటే చాలు ఎగబడి చూసేవారు. తనకోసమే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అభిమానులు కూడా ఎంతో మంది ఉండేవారు. అలాంటి సిల్క్ స్మిత ఇప్పుడు సినీ పరిశ్రమలో లేకపోవడం నిజంగా బాధాకరం. కానీ ఆమె సినిమాలతో ఇప్పటికీ ప్రతి ఒక్క సినీ అభిమానిని ఆకట్టుకుంటూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: