సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ సినిమాలు హిట్టైతే ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాయో ఫ్లాప్ టాక్ వస్తే అదే స్థాయిలో నిరాశపరుస్తాయి. రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన లాల్ సలామ్ మూవీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు డిజిటల్ స్ట్రీమింగ్ కాలేదనే సంగతి తెలిసిందే.
 
మొదట నెట్ ఫ్లిక్స్సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు మిస్ కావడంతో నెట్ ఫ్లిక్స్ ఈ డీల్ ను క్యాన్సిల్ చేసుకుంది. అయితే సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఇప్పటికైనా మోక్షం దక్కిందిగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
 
లాల్ సలామ్ సినిమాకు థియేటర్లలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అయితే రాలేదనే చెప్పాలి. లాల్ సలామ్ సినిమా ఓటీటీలో అయినా ఊహించని స్థాయిలో హిట్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో రజనీకాంత్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ అనుబంధంతోనే రజనీకాంత్ సినిమా ఫ్లాపైనా సన్ నెక్స్ట్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్టు భోగట్టా.
 
లాల్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో రజనీకాంత్ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. రజనీకాంత్ భవిష్యత్తు సినిమాలతో సైతం భారీ రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రజనీకాంత్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. రజనీకాంత్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. కూలీ సినిమాకు ఆయన 150 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకున్నారు. రజనీకాంత్ కూలీ సినిమా ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: