
అయితే ఈ రోజున ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయి అప్డేట్ రాబోతున్నట్లు తెలియజేశారు. ఈరోజు మధ్యాహ్నం 3:33 నిమిషాలకు భారీ అప్డేట్ ఇస్తామంటూ చిత్ర బృందం వెల్లడించింది. అయితే ఇది కచ్చితంగా రిలీజ్ డేట్ కి సంబంధించిన విషయమే అంటూ అభిమానులు మాట్లాడుతున్నారు. ఘాటి సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పైన కూడా అటు అనుష్క అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాదాపుగా ఈమె సినిమా విడుదల కాక ఇప్పటికి ఏడాదిపైనే కావస్తోంది.
ముఖ్యంగా డైరెక్టర్ క్రిష్ కు కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. అందుకే ఈ ఇద్దరికీ ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇస్తుందని అభిమానులయితే భావిస్తున్నారు. మరి ఈరోజున ఏ మేరకు ఎలాంటి అప్డేట్ ఇస్తారనే విషయం తెలియాల్సి ఉన్నది. అనుష్క ఇందులో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అనుష్క యాక్టింగ్ కూడా అదిరిపోయేలా ఉండబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాకి బాగానే జరుగుతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ రోజున అప్డేట్ ఏ విధంగా వస్తుందో చూడాలి.