సినీ హీరో, జనసేన పార్టీ అనేది నేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా చాలా కాలం తర్వాత సినిమా రిలీజ్ కాబోతోంది. హరిహర వీరమల్లు సినిమా ఈనెల 12వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు..అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ ని కూడా చిత్ర బృందం మొదలుపెట్టలేదు. దీంతో అభిమానులు కొంతమేరకు నిరాశతో ఉన్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈనెల 8వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని తెలుస్తోంది.



అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. ఎస్వీ యూనివర్సిటీ తారక రామారావు గ్రౌండ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది. మరి మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇక్కడ చేయబోతున్నారు ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి. అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా వచ్చే అవకాశాలు ఉండడంతో చాలా పగడ్బందీగా ఏర్పాటు చేయబోతున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓకే చెప్పడంతో అభిమానులు ఆనందపడుతున్నారు. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఒక పీరియాడికల్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు.


ఇప్పటివరకు విడుదలైన పాటలు, పోస్టర్స్ ,గ్లింప్స్ హరిహర వీరమల్లు చిత్రానికి ప్లస్ గానే మారాయి.. అయితే అభిమానులు ట్రైలర్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల అయితే కచ్చితంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓటిటి డీల్ కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రస్తుతం చిత్ర బృందం సినిమా టికెట్ల ధరలు పెంపు కోసం అటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరినట్లు తెలుస్తోంది. మరి మొదటి రోజు ఏ విధంగా కలెక్షన్స్ ని రాబట్టి సరికొత్త రికార్డులను తిరగా రాస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: