
దానికి కారణం ఏంటో కూడా అందరికీ తెలిసిందే . కాగా ప్రజెంట్ అనిల్ రావిపూడి - చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నారు. మెగా 157 షూటింగ్లో చిరంజీవి బిజీ బిజీగా ఉన్నాడు . రీసెంట్ గానే స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ 40% సినిమా షెడ్యూల్ ని కంప్లీట్ చేసేసింది అంటూ టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్లో ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చిత్రీకరించబోతున్నారట మూవీ మేకర్స్. అంతేకాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ చూస్ చేసుకున్నాడు అనిల్ రవిపూడి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమె మరెవరో కాదు. హీరోయిన్ "పూజ హెగ్డే ". ఆల్ రెడి ఎఫ్ 3 సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ లో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే - చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరవబోతుంది అంటూ సినీ వర్గాలలో ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఆల్రెడీ ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. రెండవ హీరోయిన్గా కేధరిన్ ని చూస్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది . ఇప్పుడు హీరోయిన్ పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ అంటూ టాక్ వినిపిస్తుంది . బ్యాక్ టు బ్యాక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలు లీక్ అవుతూ అభిమానులకి పూనకాలు తెప్పించేస్తున్నాయి . ఒకే సినిమాలో నయనతార - కేథరిన్ - పూజ హెగ్డే లాంటి ముగ్గురు టాప్ బ్యూటీస్ ని చూస్తే ఆ కిక్కే వేరు అంటూ ఓ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నాడు మెగా ఫ్యాన్స్ కి అంటూ తెగ కామెంట్స్ వినిపించేస్తున్నాయి..!!