
టాలీవుడ్ లో ప్రస్తుతం పాత సినిమా ల రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ క్రమంలోనే పాత సినిమాలను ఇప్పుడు రీ రిలీజ్ చేసినా కూడా అదిరిపోయే వసూళ్లు కొల్ల గొడుతున్నాయి. గత మూడేళ్లుగా టాలీవుడ్ లో ఈ ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. మరీ ముఖ్యంగా మహేష్ బాబు సినిమా లు ఇప్పుడు రిలీజ్ చేస్తుంటే మామూలు వసూళ్లు కొల్లగొట్టడం లేదు. ఈ క్రమంలోనే మహేష్ బాబు 15 ఏళ్ల క్రితం నటించిన కల్ట్ క్లాసిక్ సినిమా ఖలేజా ను తాజాగా థియేటర్ల లోకి తీసుకువచ్చారు. గత శుక్రవారం ముగ్గురు టాలీవుడ్ కుర్ర హీరోలు నటించిన భైరవం సినిమా కు పోటీ గా వచ్చి అదర గొట్టేసింది.
ఓవరాల్ గా రీ రిలీజ్ సినిమా ల చరిత్రలోనే అత్యధి కంగా రు. 13. 2 కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొట్టింది. దీనిని బట్టి ఖలేజా సినిమా కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో తెలుస్తోంది. అప్పట్లో ఈ సినిమా ను ఎందుకు ప్లాప్ చేశామా ? అని బాధపడిన తెలుగు సినీ ప్రేమికులు రీ రిలీజ్ లో సూపర్ డూపర్ హిట్ చేసి ఖలేజా సినిమా మంచి సినిమా అని .. అప్పట్లో ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశారని మరో సారి ఫ్రూవ్ చేశారు. ఇక బుల్లి తెరపై ఖలేజా ఎన్ని సార్లు ప్రదర్శితం అయినా టాప్ టీఆర్పీ రేటింగులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు