కొద్ది నెలల క్రితం కుంభమేళాలో పవన్ కళ్యాణ్ పర్సనాలిటీ చూసి చాలామంది షాక్ అయ్యారు. నాడు షర్ట్ లేకుండా స్నానం చేస్తున్న ఓ ఫోటోలో పవన్ కు కాస్త పొట్ట కనపడడంతో ఆయన్ను తెగ ట్రోల్ చేశారు. అయితే నేడు ట్రోలర్స్ కు పవన్ గట్టి సమాధానం ఇచ్చారు. నాలుగు నెలలు తిరక్క ముందే పది కిలోలు బరువు తగ్గి సూపర్ హిట్ గా మారారు. రీసెంట్ గా తన పర్సనల్ హెయిర్ స్టయిలిష్‌ సెలూన్ ఓపెనింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.


గ‌త కొంత కాలం నుంచి కుర్తా, పైజామాలోనే క‌నిపించిన పీకే.. సెలూన్ ఓపెనింగ్ లో మాత్రం జిమ్ డ్రెస్‌లో షార్ట్‌, టీ ష‌ర్ట్ తో ద‌ర్శ‌నం ఇచ్చారు. అయితే ఈ లుక్ లో అయిన ఫిజిక్ చూసి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. సూప‌ర్ హిట్ గా ప‌వ‌న్ క‌నిపించ‌డంతో.. ఆయ‌న డైట్ సీక్రెట్ తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ డైట్ సీక్రెట్ గురించి ఆరా తీస్తే.. కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.


గత కొద్ది నెలల నుంచి పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ డైట్ ను ఫాలో అవుతున్నారట. రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నారట.. అది కూడా చాలా మితంగా. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటారట. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల్లోపు రెండుసార్లు బ్లాక్ కాఫీ.. రెండు నుంచి మూడు గంటల నడుమ లైట్ మీల్స్ తీసుకుంటారట. ఇక రాత్రికి ఎటువంటి సాలిడ్స్ లేకుండా ఫ్రూట్ జ్యూస్ లేదా మజ్జిగ తాగుతారట. ఇంత కఠినమైన డైట్ ను ఫాలో అవ్వడం వల్లే రీసెంట్ టైంలో పీకే 10 కేజీల వరకు బరువు తగ్గార‌ని సమాచారం.


కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలో `ఓజీ` మూవీ చేస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ తో `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్`ను కూడా పట్టాలికించాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన `హరిహర వీరమల్లు` రిలీజ్ కు రెడీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: