
ఒక దశలో ఐకాన్ సినిమా ఆరంభం కాకముందే ఆగిపోయింది అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ దిల్ రాజు మాత్రం ఐకాన్ కచ్చితంగా ఉంటుందని గతంలో ఓ సినిమా ఈవెంట్ లో బలంగా చెప్పారు. ఆ తర్వాత ఐకాన్ ఊసే లేదు. మొన్నామధ్య అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీకి ఐకాన్ టైటిల్ అనుకుంటున్నారని.. దిల్ రాజు కూడా టైటిల్ ఇచ్చేయడానికి రెడీ అయ్యారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా `తమ్ముడు` ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారం నిజం కాదని తేలిపోయింది.
డైరెక్టర్ వేణు శ్రీరామ్, నితిన్ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ డ్రామానే తమ్ముడు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ జూలై 4న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. `పుష్ప కారణంగా ఐకాన్ డిలే అయింది. అందుకే డైరెక్టర్ వేణు తమ్ముడు కథ రెడీ చేశాడు` అని పేర్కొన్నారు. ఈయన మాటలు బట్టి చూస్తే.. ఐకాన్ డిలే అయింది అన్నారు కానీ ఆగిపోయిందని చెప్పలేదు. సో ఐకాన్ ప్రాజెక్ట్ ఇంకా ఆన్‌లోనే ఉందన్న సంగతి తేలిపోయింది. మరి ఈ మూవీ చేసేందుకు బన్నీ ముందుకు వస్తాడా? లేదా? అన్నది చూడాలి.