
అందులో భాగంగానే శుక్రవారం కుమారుడు మార్క్ శంకర్ ను పటాన్ చెరు సమీపంలోని ఇక్రిశాట్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్(ISH) లో పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి చేర్పించారు. హైదరాబాద్ లో ఏర్పడిన మొదటి అంతర్జాతీయ పాఠశాల ఇది. హైదరాబాదు సిటీకి సుమారు 40 కిలోమీటర్లు దూరంలో ఈ స్కూల్ ఉంది. పచ్చదనం, భద్రత, ప్రకృతి వాతావరణంతో ఎంతో సుందరగా ఉండే ఈ పాఠశాలను విదేశీ విద్యార్థులు, విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఎలిమెంటరీ నుండి గ్రేడ్ 12 వరకు విద్య అందిస్తారు. అది కూడా అంతర్జాతీయ స్థాయి పాఠాలే చెబుతారు.
అలాగే ఈ స్కూల్‌లో 400 విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఎవరికి పడితే వారికి అడ్మిషన్లు ఇవ్వరు. విద్యార్థుల్లో సగానికిపైగా మంది విదేశాల నుంచి వచ్చినవారే ఉంటారు. స్కూల్ లో సిబ్బంది కూడా 35 శాతం వరకు ఇతర దేశాల నుంచి వచ్చిన వారే ఉంటారు. బట్టీ పట్టించడం, పరీక్షలు, మార్కులు వంటివి ఇక్కడ ఉండవు. ఒక్కో తరగతిలో 15 నుండి 20 మంది విద్యార్థులే ఉంటారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ, గైడెన్స్ అందిస్తారు. ఈ స్కూల్ లో చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అంతర్జాతీయ యూనివర్శిటీలే ఇస్తాయి. ఇక్కడ చదువుకున్న తర్వాత నేరుగా విదేశీయ యూనివర్శిటీల్లో జాయిన్ అవ్వొచ్చు. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లోనే చదువుకుంటున్నారు. ఇక ఈ స్కూల్‌లో ఫీజు తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వడం ఖాయం. కేవలం అడ్మిషన్ తీసుకోవడానికే ఏకంగా రూ. 8 నుంచి 12 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుందట. ఏడాదికి స్కూల్ ఫీజు మరియు ఇతర ఖర్చులు కలిపి మరో రూ. 10 లక్షల వరకూ అవుతుందని అంటున్నారు.