టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో అనుష్క శెట్టి ఒకరు. ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం అందుకోకపోయినా ఇందులో అనుష్క తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత ఈమె అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఇప్పటికి కూడా ఈమె అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈమె ఎక్కువ శాతం ఏ ఈవెంట్లకు వచ్చినా కూడా చాలా క్లాస్ లుక్ లో వస్తూ ఉంటుంది. దానితో అనుష్క ను చాలా మంది ఈవెంట్లలో చూసి ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ను పొగుడుతూ ఉంటారు. ఇకపోతే ఈమె ప్రభాస్ హీరో గా రూపొందిన బిల్లా సినిమాలో గ్లామరస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా అనుష్క మాట్లాడుతూ ... తాను ఎప్పుడూ కూడా పద్దతిగా ఉండాలని తన తల్లి అనుకుంటుందని కానీ అలాంటి తన తల్లి బిల్లా సినిమా చూసి ఇంకా స్టైలిష్ గా ఉండొచ్చు కదా అంది అని , అలాగే సగం పద్దతిగా మరియు సగం మోడ్రన్ గా ఆ డ్రెస్సులేంటీ అని అనడంతో ఎంతో షాకయ్యానని అనుష్క చెప్పుకొచ్చింది. ఇకపోతే అనుష్క ఆఖరుగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ లో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈమె క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: