రామోజీ ఫిలిం సిటీ ఓ అందాల నిలయం.. ఇందులో లెక్కలేనన్ని అద్భుతాలు కనిపిస్తాయి. ఏ సినిమా షూటింగ్ అయిన రామోజీ ఫిలిం సిటీ లో తీసుకోవచ్చు. అలా హాలీవుడ్ ని తలపించే ఎన్నో భారీ భారీ సెట్స్ కూడా ఈ రామోజీ ఫిలిం సిటీ లో కనిపిస్తాయి.అలా రామోజీ ఫిలిం సిటీ దాదాపు 2000 ఎకరాలలో విస్తరించి ఉంది. అయితే అలాంటి రామోజీ ఫిలిం సిటీ ఓ దెయ్యాల కొంప అంటూ తాజాగా హీరోయిన్లు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే రీసెంట్గా బాలీవుడ్ నటి కాజోల్ నాకు ఓ ప్లేస్ కి వెళ్తే నెగటివ్ వైబ్స్ వచ్చాయని, అక్కడ ఉండే ఓ హోటల్ రూమ్లో బస చేస్తే దయ్యాలు వచ్చినట్లు కనిపించాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్లేస్ అంటూ రామోజీ ఫిలిం సిటీపై ఓ ముద్ర వేసింది. 

అయితే ఇదే విషయాన్ని గతంలోని ఓ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో రాశి ఖన్నా, తాప్సి పన్నులు కూడా కన్ఫామ్ చేశారు.గతంలో తాప్సీ పన్ను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామోజీ ఫిలిం సిటీ లో ఉండే హోటల్ లోని ఓ గదిలో నేను రాత్రి నిద్రపోయినప్పుడు దయ్యాలు ఉన్నట్టు అనిపించింది. అంతే కాదు నాతో పాటు ఎవరూ లేకున్నా కూడా ఎవరో నడుస్తున్నట్టు అనిపించింది. నేను దయ్యాలు ఉన్నాయని బలంగా నమ్ముతాను. ఆ టైంలో నిద్ర కూడా పట్టలేదు. కానీ దయ్యాలు లేవు ఏమి లేవు అని నాకు నేను సర్ది చెప్పుకొని బలవంతంగా పడుకున్నాను  అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే రాశి ఖన్నా కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామోజీ ఫిలిం సిటీ లోని ఓ హోటల్ లో రాత్రిపూట స్టే చేసినప్పుడు నాతో ఎవరూ లేకున్నా కూడా నేను కప్పుకున్న దుప్పటిని ఎవరో తీసేసినట్టు నన్ను ఎవరో పిలిచినట్టు అలా నేను పడుకున్న బెడ్ అటు ఇటు కదిలినట్టు అనిపించింది అని చెప్పుకొచ్చింది. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ.. గూగుల్ లో అత్యంత భయంకరమైన ప్లేస్ ఏది అని కొడితే రామోజీ ఫిలిం సిటీ పేరే వస్తుంది. అక్కడ సింఫనీ స్టూడియోలో కొంతమంది లేడీ సింగర్స్ పాడుతున్నప్పుడు వారి చెవిలో వెరైటీ శబ్దాలు వినిపించాయి.నాకు కూడా అక్కడ ఓ చేదు అనుభవం ఎదురయ్యింది.. అంటూ కీరవాణి కూడా రామోజీ ఫిలిం సిటీ లో దెయ్యాలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: