టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో పవన్ కళ్యాణ్ ఒకరు అనే విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే ఆ సినిమాకు ముందు ఒక వారం , తర్వాత ఒక వారం సినిమాలు లేకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం పవన్ సినిమాకి హిట్ టాక్ వచ్చినట్లయితే ప్రేక్షకులు ఎక్కువ శాతం ఆయన సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దానితో ముందు వారం , వెనుక వారం ఏదైనా వేరే సినిమా విడుదల అయితే ఆ సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా పెద్ద స్థాయిలో కలెక్షన్లు రావు అనే ఉద్దేశంతో పవన్ సినిమాకు దరిదాపుల్లో వేరే సినిమాలు లేకుండా మేకర్స్ జాగ్రత్తపడుతూ ఉంటారు.

ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జూలై 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ వచ్చాక ఈ మూవీ విడుదల తేదీ వస్తుంది అని , కాకపోతే ఈ సినిమాను జూలై 25 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని ఓ వార్త బలంగా వైరల్ అయింది.

దానితో జులై 24 వ తేదీన హరిహర వీరమల్లు సినిమా విడుదల కన్ఫామ్ అయిపోయింది. దానితో కింగ్డమ్ సినిమాను జూలై 25 వ తేదీన విడుదల చేస్తారా ..? లేక పవన్ సినిమాకు దూరంగా మరేదైనా విడుదల తేదీని కన్ఫామ్ చేస్తారా అనే దానిపై ప్రేక్షకుల్లో ఇప్పుడు ఉత్కంఠ పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: