
గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం బాలయ్య , బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు .. ఇక ఇప్పుడు ‘అఖండ 2 – తాండవం’ పై కూడా అదే స్థాయి లో భారీ అంచనాలు ఉన్నాయి .. అయితే ఇప్పుడు ఈ సినిమా పై రోజుకొక రూమర్ బైటికి వస్తూనే ఉంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించి ఎలాంటి వార్తా వచ్చిన సోషల్ మీడియాలో తెగ అది హైలెట్ గా మారుతుంది .. అయితే ఈ సమయం లోనే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట .. వచ్చే షెడ్యూల్లో ఈ సాంగ్ షూట్ ను చేయాలని ఆ తర్వాత బాలయ్య షాట్స్ ను ఈ సాంగ్లో యాడ్ చేయాలని మేకర్స్ బిగ్ డిసిషన్ కు వచ్చినట్టు తెలుస్తుంది ..
అయితే ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీ ఆచంట నిర్మిస్తున్నారు . అలాగే నందమూరి తమన్ ఈ సినిమా కు మ్యూజిక్ అందిస్తున్నారు .. ఇక ఈ సినిమా లో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు .. అలాగే అందాల బ్యూటీ సంయుక్త మీనన్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుండగా మరో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నారు .. బోయపాటి శ్రీను , బాలయ్య కాంబినేషన్లో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి .. దీంతో అఖండ 2 తండవం పై ఊహించని రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు