కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, హీరోయిన్ త్రిష డేటింగ్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. `లియో`, `గోట్‌` చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ జంట‌గా న‌టించ‌డం, 2024 జూన్‌లో విజ‌య్ తో ఒక మిర్రార్ సెల్ఫీని త్రిష‌ పోస్ట్ చేయ‌డంతో డేటింగ్ వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో భార్య సంగీత‌తో విజ‌య్ విడాకులు తీసుకుంటున్నట్లు కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ త‌ర్వాత అంతా సైలెంట్ అయింది.


అయితే ఇప్పుడు మ‌రోసారి అటువంటి వార్త‌లే సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్నాయి. ఆదివారం ద‌ళ‌ప‌తి విజ‌య్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా త‌న ఇంట్లో విజ‌య్ పెట్‌తో ఆడుకుంటున్న ఫోటోను పంచుకున్న త్రిష‌.. `హ్యాపీ బ‌ర్త్‌డే` అంటూ విష్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు అనేక అనుమానాల‌కు తెర లేపింది. నిజంగా త్రిష‌తో విజ‌య్ డేటింగ్ చేస్తున్నారా? ఇద్ద‌రూ ఒకే ఇంట్లో ఉంటున్నారా? అంటూ సామాజిక మాధ్య‌మాల్లో నెటిజ‌న్లు తెగ చ‌ర్చించుకుంటున్నారు.
కాగా, కెరీర్ విష‌యానికి వ‌స్తే.. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ త్రిష చేతి నిండా చిత్రాల‌తో ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవితో `విశ్వంభ‌ర‌`, త‌మిళంలో సూర్య‌తో `కరుప్పు` చిత్రాలు చేస్తోంది. మ‌రోవైపు ద‌ళ‌ప‌తి విజ‌య్ `జ‌న నాయ‌గ‌ణ్‌` సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే రాజకీయాల్లోకి వ‌చ్చిన విజ‌య్‌కు.. ఇదే చివ‌రి చిత్ర‌మ‌ని అంటున్నారు. వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ బ‌రిలోకి దిగ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: