
ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. తాజాగా నటి లయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తమ్ముడు మూవీలో నటించడానికి గల మెయిన్ రీజన్ ఏంటో లయ బోల్డ్ గా చెప్పేశారు. 2006 తర్వాత లయ ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుని భర్తతో ఫారెన్ లో సెటిల్ అయిన లయ.. ఈ మధ్యలో `బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం`, `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రాల్లో మెరిసినప్పటికీ అవి కేవలం గెస్ట్ రోల్స్ మాత్రమే.
కానీ, తమ్ముడు సినిమాలో ఆమె చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. నితిన్ తర్వాత సినిమాలో హైలెట్ అయ్యేది లయ క్యారెక్టరే అని అంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో కథాబలం వల్లే తమ్ముడు మూవీ చేశానని.. ఈ చిత్రంలోని పాత్ర తనను ఎంతగానో ఎగ్జైట్ అయ్యేలా చేసిందని లయ చెప్పుకొచ్చింది. ఎమోషన్ మరియు నటించడానికి బాగా స్కోప్ ఉండటంతో మరో ఆలోచన లేకుండా సినిమాకు సైన్ చేసినట్లు లయ పేర్కొంది. అదేవిధంగా ఇన్నేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తాను దిల్ రాజు గారి బ్యానర్ లో రీఎంట్రీ ఇస్తుండటం చాలా సంతోషాన్ని ఇచ్చిందని లయ తెలిపింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు