గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు `తమ్ముడు` మూవీతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ కు `వకీల్ సాబ్` వంటి క్రేజీ హిట్ అందించిన వేణు శ్రీరామ్ తమ్ముడు చిత్రాన్ని తెరకెక్కించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లు కాగా.. సీనియర్ నటి లయ నితిన్ కు అక్కగా ముఖ్యమైన పాత్రను పోషించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
అక్కాతమ్ముడు అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రం జూలై 4న విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్ మూవీపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ప్రమోషన్స్ ద్వారా చిత్ర బృందం మరింత హైప్ పెంచుతోంది. అయితే తమ్ముడు మూవీలో లయ కూతురుగా, నితిన్ మేనకోడలిగా ఓ చిన్నారి నటించింది. ఆ చిన్నారి పేరు దీత్య శ్రీరామ్. కథలో దీత్య పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుంది.
ఇంతకీ దీత్య మరెవరో కాదు డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూతురు. అవును, మీరు విన్నది నిజమే. తమ్ముడు ప్రమోషన్స్ లోనూ దీత్య పాల్గొంటోంది. తన ముద్దు ముద్దు మాటలతో అందర్నీ ఆకట్టుకుంటోంది. తండ్రి మాదిరిగానే దీత్య కూడా పవన్ కళ్యాణ్‌కు అభిమాని. మరి తమ్ముడు మూవీతో వెండితెరపై బాలనటిగా అడుగుపెడుతున్న దీత్య ఈ మేకర్స్ ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు