గేమ్ ఛేంజర్.. రీసెంట్ టైంలో నిర్మాతగా దిల్ రాజు ఎదుర్కొన్న బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఇది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. దిల్ రాజుకు హెవీ న‌ష్టాల‌ను మిగిల్చింది. రిలీజ్ తర్వాత చాలా సందర్భాల్లో గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడేందుకు కూడా దిల్ రాజు ఇష్టపడలేదు.


అయితే తాజాగా `తమ్ముడు` మూవీ ప్రమోషన్‌లో ఈవెంట్‌లో ఆయ‌న బరస్ట్ అయిపోయారు. గేమ్ ఛేంజర్ సినిమా చేయడం తన కెరీర్ లోనే ఒక బిగ్‌ మిస్టేక్ అని స్వయంగా దిల్ రాజు ఒప్పుకున్నారు. `సినిమా ర‌న్‌ టైం నాలుగున్న‌ర‌ గంటలు వచ్చింది. మేకింగ్ విషయంలో తప్పులు జరిగితే నిర్మాతగా దాన్ని ఆపాల్సిన బాధ్యత నాదే.. కానీ అలా చేయ‌లేక‌పోయాను. శంకర్‌ వంటి పెద్ద డైరెక్టర్ తో ఎప్పుడు సినిమా చేయలేదు. పెద్ద డైరెక్ట‌ర్ల‌తో పనిచేసేటప్పుడు అగ్రిమెంట్‌లో క్లియర్ పాయింట్స్‌ పెట్టి ముందుకు వెళ్లాల‌ని నాకు తెలుసొచ్చింది. త‌ప్పు నాదే.. గేమ్ ఛేంజ‌ర్ వ‌ల్ల‌ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను` అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు.


ఆయ‌న మాట‌లు బ‌ట్టి చూస్తే.. గేమ్ ఛేంజ‌ర్ దిల్ రాజును ఎంత‌లా ఎఫెక్ట్ చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి టైమ్‌లో పుండు మీద కారం చ‌ల్లిన మాదిరి దిల్ రాజుపై ప‌రోక్షంగా సెటైర్ వేశారు బండ్ల గ‌ణేష్‌. `రామ్ చ‌ర‌ణ్‌తో గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాను నిర్మించ‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతం` అంటూ ప‌నిగ‌ట్టుకుని మ‌రీ బండ్ల గ‌ణేష్ తాజాగా పోస్ట్ పెట్టారు. దిల్ రాజును ఎద్దేవా చేయ‌డానికి బండ్ల గ‌ణేష్ ఈ విధంగా పోస్ట్ పెట్టారని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: