
ఎన్టీఆర్ రీసెంట్గా లార్డ్ మురుగన్ బుక్ చేతుల్లో పట్టుకొని కనిపించాడు. దీంతో ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ కన్ఫామ్ అయిపోయిన్నట్లే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు..? అనే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ బ్యూటీ ని పెట్టాలి అంటూ మేకర్స్ ముందుగానే ఫిక్స్ అయిపోయారట . దానికి కారణం సినిమా కథ కంటెంట్ ఆ లెవెల్ లో ఉంటుంది . అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు - జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాల్లో ఫుల్ ఫామ్ లో ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ని హీరోయిన్గా పెట్టుకోవాలి అనుకుంటున్నారట . జూనియర్ ఎన్టీఆర్ - రష్మిక కాంబోలో ఒక్క సినిమా అయినా పడాలి అంటూ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు .
ఇన్నాళ్ళకి ఆ కోరిక నెరవేర బోతున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ ఆల్ రెడీ ఈ సినిమా గురించి రష్మిక తో మాట్లాడేసారట . రష్మిక కూడా ఓకే కానీ కాల్ షీట్ విషయంలో మాత్రమే కొన్ని కన్ఫ్యూషన్స్ ఉన్నాయట . రష్మిక చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి కమిట్ అయితే ఏడో సినిమా అవుతుంది . అన్ని సినిమాలకు కాల్ షీట్ ఓకే టైం లో అడ్జస్ట్ చేయాలి అంటే టఫ్ . కానీ రష్మిక మాత్రం కచ్చితంగా ఈ సినిమాకి కాల్ షీట్ ఇస్తాను అంటూ ప్రామిస్ చేసిందట . దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ - రష్మిక -త్రివిక్రమ్ ల కాంబో గురించి ఓ లెవెల్ లో మాట్లాడుకుంటున్నారు అభిమానులు . ఈ కాంబో సెట్ అయిందంటే మాత్రం పుష్ప2 రికార్డ్స్ ని బీట్ చేసే సత్తా ఈ మూవీకి వస్తుంది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు అంటున్నారు సినీ ప్రముఖులు. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..? ఇక ఈ సినిమాని హారిక హాసిని నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నట్లుగా తెలుస్తుంది..!!