టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ కింగ్డమ్ .. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికి తెలిసిందే .. ఇక ఈ సినిమాను జెర్సీ దర్శకుడు  గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి . ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను మరింత పెంచేసింది .. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి రివ్యూ ఇచ్చేశారు నిర్మాత నాగ వంశీ .. ఈ సినిమాను ఇప్పటికే ఆయ‌నా చూశానని కూడా చెప్పుకొచ్చారు .  


ప్రధానంగా ఈ సినిమా ర‌ష్ చూసిన తర్వాత ఈ మూవీ ఎలా ఉందో అందరూ అడుగుతున్నారని .. అలాగే ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సెన్సేషన్ రికార్డ్ బద్దలవటం ఖాయమని .. తాను ఎంతగానో నమ్మితే గాని ఈ విషయం చెప్పను .  ఎందుకంటే అది కొంచెం తేడా కొట్టిన, నాపై వచ్చే నెగటివ్ కామెంట్స్ అంతలా ఉంటాయి .. ఈ సినిమా ఖచ్చితంగా  బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని దిమ్మగా చెప్పగలనని నాగ‌ వంశీ చెప్పుకొచ్చారు. . అలాగే కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాగా కింగ్డమ్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెడుతుందని .. దర్శకుడుగా గౌతమ్ తనదైన స్టైల్ లో ఈ మూవీలో డ్రామాను పండించారని కూడా చెప్పుకొచ్చారు .. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ టీజర్ తో పాటు సాంగ్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు .. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా  భాగ్యశ్రీ బొర్సే నటిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: