
కూలీ సినిమా రైట్స్ 44 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఆ మొత్తానికి రెట్టింపు స్థాయిలో ఈ సినిమా హక్కులు అమ్ముడైనట్టు సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన నాగవంశీ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఆంధ్ర హక్కులు 35 కోట్ల రూపాయాలకు నైజాం హక్కులు సైతం 35 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
ఈ సినిమా సీడెడ్ హక్కులు మాత్రం 18 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని భోగట్టా. నైజాం ఏరియాకు హిందీ వెర్షన్ తో కలిపి హక్కులు తీసుకున్నారని తెలుస్తోంది. దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 152 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో బిజినెస్ జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీకి రెగ్యులర్ బయ్యర్లు ఉన్న నేపథ్యంలో వార్ 2 సినిమా రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు నాగవంశీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విజయాలను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. వార్ 2 మూవీ సంచలన రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.