తెలుగు ఇండస్ట్రిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రామ్ పోతినేని పై అటాక్  ప్లాన్ జరిగినట్టు తెలుస్తుంది . తెలుగు యువ కథానాయకుడు రామ్ పోతినేని ప్రజెంట్ రాజమండ్రిలో తన సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . మనకు తెలిసిందే రాం పోతినేని "ఆంధ్ర కింగ్" అనే సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నాడు రాంపోతునేని.  ఈ మధ్యకాలంలో ఆయన నటించిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది . ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలి అంటూ చాలా కష్టపడుతున్నాడు.


అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆంధ్ర కింగ్ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి షూట్లో పాల్గొంటున్నారు. కాగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్న హీరో రామ్ పోతినేని పై అటాక్ ప్లాన్ చేశారు కొంత మంది దుండగులు . ఇదే విషయం టాలీవుడ్   సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది .  అర్ధరాత్రి ఆయన నివాసం ఉన్న ఓ ప్రముఖ హోటల్లో అనుమానస్పద ఘటన చోటు చేసుకోవడం పెద్ద షాకింగ్ గా ఉంది . ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రామ్ ఉండేవి వీఐపి సూట్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయింది.



దీంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది.  రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు హోటల్ రిసెప్షన్ వద్దకు వచ్చి రామ్ టీం సభ్యులమని ఆయనను కలవాలి అని అర్జెంటుగా సినిమా గురించి ఒక విషయం చెప్పాలి అంటూ ఆయన రూమ్ ఉండే లిఫ్ట్ యాక్సిస్ యాక్సిస్ ని కోరారట.  ఆ తర్వాత ఆరో అంతస్తులోని రామ్ విఐపి రూమ్ కి వెళ్లి .. హౌస్ కీపింగ్ వాళ్లని మాయమాటలతో నమ్మించి  మాస్టర్ "కీ" సంపాదించి రామ్ సూట్ లో కి కూడా ప్రవేశించేసారట . అయితే లక్కీ రామ్ ఆ సూట్ లోనే ఇంకో బెడ్రూంలో తలుపులు వేసుకొని నిద్రపోతున్నారు . దీంతో పెద్ద ప్రమాద తప్పింది . గట్టిగా తలుపులు కొట్టిన శబ్దంతో రామ్ నిద్రలేచి అలెర్ట్ అయ్యారట . వెంటనే తన టీం కి సమాచారం ఇచ్చారట.  దీంతో  ఒకసారి షూటింగ్ యూనిట్ హోటల్ సిబ్బంది హుటాహుటిన రియాక్ట్ అయ్యి వెంటనే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది . పోలీసులు  విచారణ కొనసాగిస్తున్నారు . అంతేకాదు ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది . ప్రాథమిక సమాచారం ప్రకారం వారు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తుంది . అయితే వారు ఎవరు..? ఎందుకు వచ్చారు..? ఏ ఉద్దేశంతో వచ్చారు..? అసలు రామ్ పై వాళ్ళకి పగ ఏంటి..? అనే విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది..!!!




మరింత సమాచారం తెలుసుకోండి: