
టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు నాగచైతన్య కెరీర్ ను, ఇటు సమంత కెరీర్ ను మార్చిన సినిమా ఏదనే ప్రశ్నకు ఏ మాయ చేసావే సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. గౌతమ్ మీనన్ ఈ సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించాలని ప్రయత్నించగా మహేష్ ప్లేస్ లోకి నాగచైతన్య వచ్చారనే సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాలో మహేష్ హీరోగా నటించి ఉంటే మెగాస్టార్ చిరంజీవి క్లైమాక్స్ లో గెస్ట్ రోల్ లో కనిపించేవారట.
మహేష్ బాబు ఈ సినిమాలో నటించకపోవడంతో చిరంజీవిని వెండితెరపై చూసే ఛాన్స్ మిస్ అయ్యామని చెప్పవచ్చు. ఈ నెల 18వ తేదీన ఏ మాయ చేసావే సినిమా రీరిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఏ స్థాయిలో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగచైతన్య సమంత కాంబినేషన్లో తర్వాత రోజుల్లో సైతం ఎక్కువ సంఖ్యలో సినిమాలు అయితే వచ్చాయి.
ఏ మాయ చేశావే సినిమా నాగచైతన్య కెరీర్ లో ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. ప్రస్తుతం నాగచైతన్య కార్తీక్ దండు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. వృషకర్మ అనే విచిత్రమైన టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. చైతన్య 24వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
నాగచైతన్య భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. నాగచైతన్య 25వ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగచైతన్య పాన్ ఇండియా హిట్లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. నాగచైతన్య పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు