
సప్తమి గౌడ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటించారు. శ్రీరామ్ వేణు డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ వస్తోంది. ఫస్టాఫ్ మరీ అద్భుతంగా లేకపోయినా సెకండాఫ్ ఈ సినిమాను నిలబెట్టింది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు. నితిన్ తమ్ముడు మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.
రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కాగా మధ్యాహ్నం నుంచి టాక్ ఆధారంగా పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది. రాబిన్ హుడ్ సినిమాతో నిరాశ పరిచిన నితిన్ కు తమ్ముడు సినిమా ఆశించిన ఫలితాన్ని అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ ను అందుకుంటుందా లేదా అనే ప్రశ్నకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల టాక్ కీలకం కానుందని చెప్పవచ్చు.
ఈ మధ్య కాలంలో దిల్ రాజు, శిరీష్ పలు వివాదాల్లో చిక్కుకోవడం కూడా ఈ సినిమా ఫలితంపై కొంతమేర ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తమ్ముడు సినిమా కోసం నితిన్ సైతం ఎంతో కష్టపడ్డారు. నితిన్ తర్వాత సినిమాల బిజినెస్ సైతం ఈ సినిమా ఫలితంపై ఆధారపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు ఏ సినిమాతో కూడా నిరాశపరచని శ్రీరామ్ వేణు ఈ సినిమాతో కూడా నిరాశ పరిచే ఛాన్స్ లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.