సినిమా కోసం కొంతమంది హీరోలు ఎలాంటి రిస్కీ షాట్స్ అయినా చేస్తారు? స్టాంట్స్ చేస్తూ ఉంటారు  డూప్ లేకుండా ఎంత రిస్కీ పని అయినా చేస్తూ ఉంటారు.  ఇంకొంచెం ముందుకెళ్తే సినిమా కోసం బరువు తగ్గుతారు.. బరువు పెరుగుతారు ..ఇష్టం లేకపోయినా కొన్ని హాట్ సీన్స్ లో నటిస్తారు . ఇంతవరకే కానీ ఒక సినిమా కోసం పచ్చబొట్టుపొడిపించుకోవాలి అంటే.. వామ్మో ..? "మేం చేయం".  మూడు గంటల సినిమా కోసం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విధంగా పచ్చబొట్టు పొడిపించుకోవాలా..?  ఆ నొప్పి మేము భరించలేం  అంటూ బిగ్ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తప్పుకుంటూ ఉంటారు స్టార్ హీరోస్.


అయితే చాలా తక్కువ మంది మాత్రమే సినిమా కోసం ఏమైనా చేస్తాం.. దేనికైనా రెడీ అనే లా ఉంటారు.  వాళ్లలో ఒకరే నాగార్జున . "శివమణి" సినిమా కోసం ఆయన ఏకంగా చేతికి పచ్చబొట్టుపొడిపించుకున్న విషయం అందరికీ తెలిసిందే.  అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది . చాలా మంది నాగార్జున చేసిన పనిని ఓ రేంజ్ లో పొగిడేశారు. ఆ తర్వాత ఏ హీరో కూడా అలాంటి సాహసం చేయలేకపోయారు . కొందరు హీరోలు పచ్చ బొట్టూ కోసం సినిమా వదులు కున్నారు.



అయితే ఇన్నాళ్ళకి మళ్లీ సినిమా కోసం పచ్చబొట్టుపొడించుకోవడానికి సిద్ధమయ్యాడు మహేష్ బాబు . అది కూడా అసలు మహేష్ బాబుకి ఇష్టం లేకుండానే . మహేష్ బాబుకి పచ్చబొట్టు పొడిపించుకోవడం అస్సలు ఇష్టం లేదు . కానీ ఆయన నమ్మిన ప్రాజెక్ట్ కోసం ఈ పని చేయక తప్పడం లేదు అంటూ తెలుస్తుంది . స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం మహేష్ బాబు ఒక పచ్చబొట్టు పొడి పెంచుకోవాలట . అది కూడా ఆయన చాతి మీద . దానికి మహేష్ బాబు ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది . ఇష్టం లేకుండానే ఈ పని చేయడానికి ఒప్పుకున్నారట. దీంతోసినీ వర్గాలలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మహేశ్ బబౌ చేస్తున్న పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా చాలా చాలా గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: