ఈ మధ్యకాలంలో ఆడవాళ్లపై విపరీతమైన అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. అది ఎక్కడైనా సరే సమాజంలో రోడ్డుమీద,బస్సులో, ట్రైన్ లో, ఫ్లైట్ లో ఇలా ఎక్కడపడితే అక్కడ ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. సైలెంట్ గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని ఆట పట్టించడం,బస్సులో, ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న ఆడవాళ్ళని అసభ్యంగా తాకడం, సినిమా ఇండస్ట్రీలో అవకాశం కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ పేరుతో నటీమణులు కోరికలు తీరుస్తేనే వాళ్లకి అవకాశాలు ఇవ్వడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి.. ఇక బస్సులో ట్రైన్లో ఆడవాళ్ళని మగవాళ్లు అసభ్యంగా తాకుతూ ఎలా ఇబ్బంది పెడతారో చెప్పనక్కర్లేదు. అయితే అందరు మగవాళ్ళు అలా ఉంటారని కాదు.కొంతమంది మాత్రం అమ్మాయిలతో అలాగే అసభ్యంగా ప్రవర్తిస్తారు. 

అయితే ట్రైన్ లో అమ్మాయిల్ని ఎలా అయితే అసభ్యంగా తాకుతూ వేధిస్తారో అచ్చం ఇలాంటి పరిస్థితే ఒక నటికి ఎదురైందట.మరి ఇంతకీ ఆ నటి ఎవరు.. ఆమెకు ఎదురైన చేదు సంఘటన ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రకు చెందిన మరాఠీ నటి అదితీ పోహంకర్ అంటే సౌత్ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు.. పలు సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా ఇండస్ట్రీలో ఫేమస్ అయినా అదితీ పోహంకర్ జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి నటించిన లై అనే భారీ యాక్షన్ మూవీతో అదితి పోహంకర్ కి మంచి గుర్తింపు లభించింది.ఆ తర్వాత పలు వెబ్ సిరీస్, సినిమాలు, యాడ్స్ చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న అదితి పోహంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

 నేను ఓ సారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. లేడీస్ అపార్ట్మెంట్లోనే ఎక్కాను. అందులోకి అబ్బాయిలకు అలో లేదు. అయితే 18 సంవత్సరాలు లోపు ఉన్న అబ్బాయిలకు ఆ ట్రైన్ లో ఎంట్రీ ఉంటుంది. అలా నేను ట్రైన్ లోకి ఎక్కాక 18 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్నా ఓ అబ్బాయి ఆ ట్రైన్ లోకి ఎక్కాడు. ఇక ట్రైన్ కదులుతున్న సమయంలో ఆ అబ్బాయి నా రెండు వక్షోజాలను పట్టుకొని గట్టిగా లాగాడు.. ఆ టైంలో నా నోట్లో నుండి మాట కూడా రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సైలెంట్ గా ఉండిపోయాను.ఆ తర్వాత నెక్స్ట్ స్టేషన్ రావడంతోనే అక్కడే ఉన్న పోలీసులకు కంప్లైంట్ చేసి ఆ అబ్బాయి నన్ను ఇలా అసభ్యంగా తాకాడు అని చెప్పా.

కానీ పోలీసులు మాత్రం నన్ను  పట్టించుకోలేదు.ఇప్పుడు తాకితే నీకు ఏమైంది..నీకు ఏమైనా ప్రాబ్లం అయ్యిందా.. అన్నట్లుగా సమాధానం ఇచ్చారు. ఇక పోలీసులు అలా మాట్లాడడంతో సైలెంట్ గా వచ్చేసాను.కానీ తిరిగి వచ్చాక ఆ అబ్బాయి నాతో ప్రవర్తించినట్టే మరో అమ్మాయితో కూడా ప్రవర్తించాడు. ఆ సంఘటన నా జీవితంలో ఎదురైనా అత్యంత ఘోరమైన అనుభవం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అదితి పోహంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: