
ఇది రంగస్థలం 2 అంటూ టాక్ వినిపించిన కాదు ఇది కొత్త కాన్సెప్ట్ అంటూ తెర పైకి ఒక న్యూస్ వచ్చింది . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇప్పుడు రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. హీరో రామ్ చరణ్ "పెద్ది" సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు . అయితే ఈ సినిమా కోసం మెగా ఇమేజ్ ని పక్కన పెట్టేసి మరి ఒక రిస్కీ పని చేశాడు అన్న టాక్ బయటకు వచ్చింది . సాధారణంగా హీరోస్ ఫైటింగ్ సన్నివేశాలలో వాళ్ళే హైలైట్ అవుతూ ఉంటారు. డైరెక్టర్స్ అలానే కథను తీసుకెళ్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే ఫైటింగ్స్ లో హీరోని విలన్స్ చేత కొట్టిస్తూ ఉంటారు.
అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఒకానొక సన్నివేశంలో విలన్స్ చేత తన్నులు తింటారట . అది చాలా ఎమోషనల్ గా సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే సిచువేషన్ అంట. ఆ కారణంగానే రామ్ చరణ్ కూడా మెగా ఇమేజ్ ని ఏమీ అడ్డుపెట్టుకోకుండా సినిమా కోసం ఏదైనా చేస్తాను అని ఆ సీన్స్ లో నటించారట . ఈ సీన్స్ చాలా చాలా బాగా వచ్చాయట . థియేటర్స్ లో ఈ సీన్ చూస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కన్నీళ్లు కన్ఫర్మ్ అంటున్నారు మేకర్స్. రాంచరణ్ లాంటి ఒక గ్లోబల్ హీరో ఇలా విలన్స్ చేతిలో తన్నులు తిన్నేలా నటించడం ఇప్పుడు హాట్ టాపిక్ లా ట్రెండ్ అవుతుంది. సినిమాపై ఇష్టముంటే ఇలాంటి సన్నివేశాలలో నటిస్తారు అంటున్నారు అభిమానులు . రామ్ చరణ్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు...!!