తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈయన అల్లుడు శీను అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన అనేక సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో తమిళ మూవీ అయినటువంటి రాక్షసన్ కి రిమేక్ గా రూపొందిన రాక్షసుడు మూవీ తో ఈయనకు తెలుగులో మంచి విజయం దక్కింది. ఆ తర్వాత కూడా ఈయన చాలా సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఏవి కూడా ఈయనకు పెద్ద సక్సెస్ లను అందించలేకపోయాయి.

కొంత కాలం క్రితం బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు లో అద్భుతమైన విజయం సాధించిన చత్రపతి మూవీ ని హిందీ లో చత్రపతి అనే టైటిల్ తో రీమేక్ చేశాడు. ఈ మూవీ హిందీ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా ఈయన భైరవం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి గరుడన్ మూవీ కి రీమేక్ గా రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే వరుసగా రీమిక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీనివాస్ కు పెద్దగా విజయాలు దక్కడం లేదు.

కానీ మళ్ళీ ఈ నటుడు మరో రీమేక్ పై ఇంట్రెస్ట్ చూస్తున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ఓ రీమిక్ మూవీ లో నటించిన అత్యంత ఆసక్తిని చూపిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కొంత కాలం క్రితం హిందీ లో కిల్ అనే ఓ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలి అనే ఉద్దేశంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bss